ఒంగోలు డెయిరీని పునఃప్రారంభించేలా చర్యలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:44 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒంగోలు డెయిరీని పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుం టానని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లాకు చెందిన రైతులు ఆయన్ను కలిసి సమస్యను వివరించారు.
20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 13 (ఆంధ్ర జ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒంగోలు డెయిరీని పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుం టానని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లాకు చెందిన రైతులు ఆయన్ను కలిసి సమస్యను వివరించారు. డెయిరీ పునరుద్ధరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని దినకర్ చెప్పారు. గత పాలకులు డెయిరీని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రైతులు సుముఖంగా లేకపోవడంతో సదరు సంస్థలు సైతం డెయిరీని నడపలేని స్థితికి చేరుకున్నాయన్నారు. పాల ఉత్పత్తిదారులు డెయిరీని ప్రారంభించాలని వినతిపత్రం ఇచ్చారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి వారికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. దినకర్‌ను కలిసిన వారిలో బీజేపీ కిసాన్ మోర్చ అధ్యక్షుడు కావూరి వాసుతోపాటు పలువురు పాడి రైతులు ఉన్నారు.