19న రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమావేశం
ABN , Publish Date - Jun 30 , 2026 | 10:58 PM
రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది బ్రాహ్మణులతో జులై 19వ తేదీన రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ భమిడిపల్లి వెంకటరమణమూర్తి తెలిపారు.
ఒంగోలు కల్చరల్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది బ్రాహ్మణులతో జులై 19వ తేదీన రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ భమిడిపల్లి వెంకటరమణమూర్తి తెలిపారు. మంగళవారం ఒంగోలు దక్షిణబైపా్‌సలోని ఒక ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటరమణమూర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరం మన్యం గార్డెన్స్‌లో 19వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి సమావేశానికి అనేకమంది ప్రముఖులు హాజరవుతారన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయపరంగా, సంఖ్యాపరంగా బ్రాహ్మణులను గుర్తించి వారికి స్థానాలు కల్పించటం, దేవాలయాలకు స్వయంప్రతిపత్తి, బ్రాహ్మణ అట్రాసిటీ చట్ట సాధన మొదలైన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. సమితి కో ఆర్డినేటర్ టీవీ.శ్రీరామమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని బ్రాహ్మణులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ముత్య సత్యనారాయణ, కోలగంటి రమేష్, వ్యామజాల ప్రసన్నకుమార్‌శర్మ, ఎస్‌ఏటీకే.రాజేశ్, గంజాం శ్రీరంగనాథ్, పంచాగ్నుల అశ్విని, కరవది సింధూరి, పొన్నలూరి శ్రీనివాస ఫణి, వఠ్యం నాగేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.