ఇద్దరికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:38 AM
జిల్లాలోని ఇరువురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వారిలో బల్లికురవ మండలం కొప్పెరపాడు జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ పి.శ్రీనివాసరావు, ఒంగోలు పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మువ్వా రాధిక ఉన్నారు.
రేపు విజయవాడలో ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు
ఒంగోలు (విద్య)/బల్లికురవ, సెప్టెంబరు 3 (ఆంరఽధజ్యోతి) : జిల్లాలోని ఇరువురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వారిలో బల్లికురవ మండలం కొప్పెరపాడు జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ పి.శ్రీనివాసరావు, ఒంగోలు పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మువ్వా రాధిక ఉన్నారు. శ్రీనివాసరావు వ్యక్తిగత విభాగంలో, మువ్వా రాధిక లీప్ యాప్ ద్వారా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. లీప్ యాప్ వినియోగంలో గత మూడేళ్ల పనితీరు ఆధారంగా రాధికకు ఈ అవార్డు దక్కింది. పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం, పదో తరగతి ఉత్తీర్ణతలో నిరంతర పురోగతి సాధించడం, విద్యార్థుల హాజరుశాతం పెంచడం, వ్యక్తిగత సెలవులను వినియోగించు కోకుండా అన్ని పని దినాలలో క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావడం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకొని రాధికను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. కొప్పెరపాడు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పురంశెట్టి శ్రీనివాసరావు అక్కడ ఐదేళ్ల నుంచి పనిచేస్తు న్నారు. పాఠశాలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులను తీర్చిదిద్దిడంలో సఫలీకృతులయ్యారు. ఈ ఐదేళ్లలో 46 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షి్‌పనకు ఎంపికయ్యేలా ప్రత్యేక కృషి చేశారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారుల నుంచి శ్రీనివాసరావు పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. హెచ్‌ఎం శ్రీనివాసరావు 37 ఏళ్ల నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో శ్రీనివాసరావుకు ఎంఈవోలు లక్ష్మీనారాయణ, రమే్‌షబాబు, ఉపాధ్యాయులు అభినందించారు. శనివారం విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందించనుంది.