Share News

నిలిచిపోయిన సాగర్‌ జలాలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:33 AM

మండలంలోని రజానగరం మేజర్‌కు సాగర్‌ జలాలు సింగనపాలెం మైనర్‌ వద్ద పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిలిచిపోయిన సాగర్‌ జలాలు

ఆందోళనలో రజానగరం మేజర్‌ పరిధిలోని రైతులు

ముండ్లమూరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రజానగరం మేజర్‌కు సాగర్‌ జలాలు సింగనపాలెం మైనర్‌ వద్ద పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌లో 1010, సన్నాలు రకం వరి సాగు చేశారు. ప్రస్తుతం పైరు కంకి, మరికొంత పొట్ట దశలో ఉంది. గింజ గట్టిపడాలంటే నీరు పుష్కలంగా అవసరం. రెండు రోజుల నుంచి సాగర్‌ జలాలు పూర్తిగా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఎకరాకు 30 నుంచి 40వేల వరకు పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు. 15వ తేదీ వరకు నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 02:33 AM