Share News

తెలుగుజాతి గుర్తింపు కోసం శ్రీరాముల త్యాగం మరువలేనిది

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:24 PM

తెలుగు జాతికి గుర్తింపు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి, పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీస్వామి చెప్పారు.

తెలుగుజాతి గుర్తింపు కోసం శ్రీరాముల త్యాగం మరువలేనిది
నివాళి అర్పిస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎమ్యెల్యే, టూరిజం, ఓడా చైర్మన్లు, మేయర్‌, జేసీ, కమిషనర్‌

మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 16 (ఆంఽధ్రజ్యోతి) : తెలుగు జాతికి గుర్తింపు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి, పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీస్వామి చెప్పారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక సీవీఎన్‌ రీడింగ్‌ రూం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్‌ రాజాబాబు, జేసీ కల్పనాకుమారి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మేయర్‌ గంగాడ సుజాత, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్‌ ముప్పవరపు సుచిత్ర, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కాశిరెడ్డిలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ ఆ మహానీయుని సేవలను తెలుగు ప్రజలు గుర్తించుకునేలా అమరావతిలో 58 అడుగుల కాంస్యవిగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం అసాధారణ నిర్ణయం తీసుకొని దానిని సాధించేలా చిత్తశుద్ధితో ముందుకు సాగిన శ్రీరాములు మనందరికీ ఆదర్శనీయులన్నారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ శ్రీరాములు గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

అనంతరం కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయకుమార్‌, డీఆర్వో చిన ఓబులేశు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:24 PM