Share News

టీడీపీకి కార్యకర్తలే శ్రీరామరక్ష

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:31 AM

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని అలాంటి నిజాయితీ నిబద్దత కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సొంతమని పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు.

టీడీపీకి కార్యకర్తలే శ్రీరామరక్ష

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు(పర్చూరు), ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని అలాంటి నిజాయితీ నిబద్దత కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సొంతమని పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం తలపెట్టిన బాపట్ల పార్లమెంట్‌ మరియు నియోజకవర్గ నూతన కార్యాలయ భవన నిర్మాణ శంకుస్ధాపన, నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి పర్చూరు నియోజవర్గంలోని ఆయా మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్ళారు. భూమి పూజ అనంతరం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్బంగా ఏలూరి మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రతి కార్యకర్తకు దేవాలయం లాంటిది అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.

బాపట్లకు తరలిన టీడీపీ శ్రేణులు

మార్టూరు : బాపట్లలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ఆదివారం మార్టూరు, యద్దనపూడి మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మండల స్థాయి నాయకులు వాహనాలలో తరలివెళ్లారు. మార్టూరు గ్రామంలో తొండెపు ఆదినారాయణ, గుర్రం శ్రీను, సూర్య నాయక్‌, తిమ్మయ్య, అడకా లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చిట్టి, బూదయ్య, తదితరులు వాహనాలలో తరలివెళ్లారు. అదేవిధంగా టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరిన కాకోలు వెంకటేశ్వర్లు వెంట కన్నెగంటి శ్రీనివాసరావు, జాష్టి సాంబశివరావు, కొర్రపాటి కాజారావు, మాదాల సాంబశివరావు, గన్నవరం బుడే, చెరుకూరి నాగేశ్వరరావు, చెన్నుపాటి బసవ రాములు, గొట్టిపాటి వెంకట్రావు తదితర పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. అదేవిధంగా యద్దనపూడి మండలం నుండి నల్లపనేని రంగయ్య చౌదరి, గుదే తారకరామారావు, వజ్జా సుబ్బరామయ్య, బోయపాటి సాంబయ్య, కోయ సతీష్‌, దూళ్లిపాళ్ల వెంకటస్వామి, కనపర్తి నాగేశ్వరరావు తదితరులు నాయకులు తరలివెళ్లారు.

చినగంజాం : బాపట్లలో జరిగే జిల్లా టీడీపీ కార్యాలయ భూమిఫూజ, జిల్లా టీడీపీ నాయకుల ప్రమాణ స్వీకారోత్సవానికి మండల పరిధిలోని టీడీపీ శ్రేణులు ఆదివారం భారీగా బాపట్ల తరలి వెళ్లారు. మండలంలోని కడవకుదురు గ్రామానికి చెందిన నక్కల రాఘవరావు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, చినగంజాం గ్రామానికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ కలాం అజాద్‌ జిల్లా టీడీపీ అధికార ప్రతినిఽధిగా బాపట్లలో ప్రమాణ స్వీకారం చేసేందుకు మండల పరిదిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లారు. ఆయా గ్రామాల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు వాహనాలల్లో భారీ సంఖ్యలో వెళ్లారు.

Updated Date - Feb 23 , 2026 | 01:31 AM