నేటి నుంచి ఇన్‌సర్వీసు టీచర్లకు స్పెషల్ టెట్
ABN , Publish Date - Oct 11 , 2026 | 02:35 AM
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇన్‌సర్వీసు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-26) ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. 1,645 మంది ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరవుతున్నట్లు డీఈవో సీవీ రేణుక తెలిపారు.
హాజరువుతున్న 1,645 మంది అభ్యర్థులు
ఒంగోలులో రెండు కేంద్రాల ఏర్పాటు
ఒంగోలు విద్య, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇన్‌సర్వీసు టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-26) ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. 1,645 మంది ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరవుతున్నట్లు డీఈవో సీవీ రేణుక తెలిపారు. వారి కోసం ఒంగోలు భాగ్యనగర్‌లోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్‌ద చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియాలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతుంది. 11న పేపర్-1 తెలుగు, పేపర్-1బీ మైనర్ మీడియం, 12న పేపర్-1ఏ తెలుగు, పేపర్-2 హిందీ, సంస్కృతం, కన్నడ, ఒరియా, తమిళం, ఉర్దూ, 13న పేపర్-2ఏ తెలుగు, 14న పేపర్-2ఏ సోషల్, సోషల్ మైనర్ మీడియం, పేపర్-2ఏ గణితం, సైన్స్, 15న పేప ర్-2 సైన్స్, గణితం, సైన్స్ గణితం మైనర్ మీడియం పరీక్షలు జరుగు తాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. కేంద్రాల్లోకి ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమతించరు. అంధులు, రెండు చేతులు లేని అభ్యర్థులకు 50 నిమిషాలు అదనపు సమయం కేటాయిస్తారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఒంగోలు డీఈవో కార్యాలయంలోని టెట్ గ్రీవెన్స్‌సెల్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.