మండల పరిషత్‌లలో ప్రత్యేక పాలన
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:23 AM
మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం బుధవారంతో ముగిసింది. గురువారం నుంచి ఆయా మండలాల్లో ‘స్పెషల్’ పాలన రానుంది. ఈనేపథ్యంలో జిల్లాలో 28 మండలాలు ఉండగా 27 మండలాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులను కలెక్టర్ రాజాబాబు నియమించారు.
నేటి నుంచి ప్రారంభం
ముగిసిన పాలకవర్గాల పదవీకాలం
27 మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులకు బాధ్యతలు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం బుధవారంతో ముగిసింది. గురువారం నుంచి ఆయా మండలాల్లో ‘స్పెషల్’ పాలన రానుంది. ఈనేపథ్యంలో జిల్లాలో 28 మండలాలు ఉండగా 27 మండలాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులను కలెక్టర్ రాజాబాబు నియమించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలకు అనుగుణంగా ఈ ప్రక్రి యను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మండలాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి. డ్వామా ఏపీడీ (అద్దంకి), జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి (బల్లికురవ), జిల్లా ఉద్యానశాఖ అధికారి (కొరిశపాడు), జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ (జేపంగులూరు), ఇండస్ట్రీస్ డీడీ (సంతమాగు లూరు), జిల్లా వ్యవసాయ అధికారి (దర్శి), ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ (దొనకొండ), పశుసంవర్థకశాఖ డీడీ (కురిచేడు)కు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. జిల్లా పౌరసరఫరాల అధికారి (తాళ్లూరు), ఒంగోలు డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ముండ్లమూరు), పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ (కందుకూరు), జిల్లా ఫారెస్టు అధికారి (గుడ్లూరు), సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (లింగసముద్రం), మత్య్సశాఖ జాయింట్ డైరెక్టర్ (ఉలవపాడు), సెరీకల్చర్ ఏడీ (వీవీపాలెం)కు స్పెషల్ ఆఫీసర్‌గా ఉంటారు. సోషల్ వెల్ఫేర్ డీడీ (కొండపి), కందుకూరు డీడీవో (పొన్నలూరు), దివ్యాంగుల శాఖ ఏడీ (సింగరాయకొండ), ఎస్సీ కార్పొరేషన్ ఈడీ (మర్రిపూడి), బీసీ వెల్ఫేర్ అఽధికారి (టంగుటూరు), హౌసింగ్ పీడీ (జరుగుమల్లి)కి ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ (ఒంగోలు), డీఆర్‌డీఏ పీడీ (కొత్తపట్నం), చదలవాడ పశుక్షేత్రం డీడీ (సంతనూతలపాడు), ఒంగోలు అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ఏడీ (చీమకుర్తి), డ్వామా పీడీ (మద్దిపాడు), ఏపీఎంఐపీ పీడీ (నాగులుప్పలపాడు)కు స్పెషల్ ఆఫీసర్‌లుగా వ్యవహరిస్తారు.