Share News

అత్త హత్య కేసులో అల్లుడుతోపాటు ప్రియురాలు అరెస్ట్‌

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:21 PM

చీమకుర్తి పట్టణంలోని జగనన్నకాలనీలో ఈ నెల 21న జరిగిన మహిళ మీరాబీ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

అత్త హత్య కేసులో   అల్లుడుతోపాటు ప్రియురాలు అరెస్ట్‌
కేసు వివరాలను తెలియజేస్తున్న సీఐ ప్రసాద్‌, ఎ్‌సఐ సంపత్‌

చీమకుర్తి, ఆగస్టు 25(ఆంఽధ్రజ్యోతి): చీమకుర్తి పట్టణంలోని జగనన్నకాలనీలో ఈ నెల 21న జరిగిన మహిళ మీరాబీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన ఆమె అల్లుడు, ప్రియురాలిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సంపత్‌తో కలిసి మంగళవారం పోలీ్‌సస్టేషన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వివరించారు. ఈనెల 21న సాయంత్రం ఆరుగంటల సమయంలో మీరాబీ ఇంట్లోకి అల్లుడు షేక్‌ మస్తాన్‌వలీ, అతని ప్రేయసి కేశారపు అచ్యుతకుమారి చొరబడి దిండుతో ఊపిరి ఆడకుండా ఆమెను హత్య చేశారు. అనంతరం బంగారు కమ్మలు, బంగారు జాలరులను తీసుకొని ఉడాయించారు. ఈక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను ఎర్రగుడిపాడు అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు.

Updated Date - Aug 25 , 2026 | 11:21 PM