ఆన్‌లైన్ మోసాలకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:34 AM
మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దర్శి వెంకటనారాయణ (26) ఆన్‌లైన్ మోసాలకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందిన సమాచారం మేరకు.. వెంకటనారాయణ ఇంజనీరింగ్ చదివి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
పురుగుమందు తాగి ఆత్మహత్య
బల్లికురవ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దర్శి వెంకటనారాయణ (26) ఆన్‌లైన్ మోసాలకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందిన సమాచారం మేరకు.. వెంకటనారాయణ ఇంజనీరింగ్ చదివి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ తన మిత్రులకు నగదు పెద్దమొత్తంలో ఇచ్చాడు. ఆన్‌లైన్ మోసాలకు కూడా గురై అప్పుల పాలయ్యాడు. తీసుకున్న వారు నగదు ఇవ్వలేకపోయారు. విషయం తల్లిదండ్రులు, గ్రామస్థులకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం చెన్నై నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.