Share News

జనసేన పార్టీతోనే సామాజిక న్యాయం

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:02 AM

నసేన పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సా మాజిక న్యాయం జరుగుతుందని తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

జనసేన పార్టీతోనే సామాజిక న్యాయం

తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు

మద్దిపాడు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సా మాజిక న్యాయం జరుగుతుందని తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మద్దిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు నున్న బా లసుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ జనసేన పా ర్టీ క్రీయాశీలక సభ్వత్వం ప్రతి ఒక్కరూ చే యాలన్నారు. పార్టీ క్రీయాశీలక సభ్వత్వం ఉన్న కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యకర్తలకు అన్ని విధా లా అండగా ఉంటున్నట్లు తెలిపారు. వైసీపీ దుర్మార్గపు రాజకీయాలను ఎండగట్టాలని చె ప్పారు. తిరుమల లడ్డూను కల్తీని చేయడం దారుణమని విమర్శించారు. పార్టీ రాష్ట్ర నాయ కురాలు రాయపాటి అరుణ మాట్లాడుతూ కా ర్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మలగా రమేష్‌, మల్లికార్జున్‌, దాసరి పిచ్చయ్య, గారా నారాయణ, చెంగలశెట్టి సుధాకర్‌, కనపర్తి శేషయ్య, ఘడియపూడి సత్యనారాయణ, వెంక టేశ్వర్లు, గుడిమెట్ల కోటయ్య, అనిల్‌కుమార్‌, వీర మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 01:02 AM