Share News

ఎస్‌ఎంసీ తప్పనిసరి

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:15 AM

ప్రతి పాఠశాలలో స్కూల్‌ యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఏర్పాటు తప్పని సరి. యుడైస్‌ కోడ్‌ ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎన్ని కలు నిర్వహించాల్సిందే. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి.

ఎస్‌ఎంసీ తప్పనిసరి

కమిటీ లేని స్కూళ్లకు గ్రాంట్స్‌ కట్‌

తుది ఓటర్ల జాబితా ప్రకటన

ఒంగోలు విద్య, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి పాఠశాలలో స్కూల్‌ యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఏర్పాటు తప్పని సరి. యుడైస్‌ కోడ్‌ ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎన్ని కలు నిర్వహించాల్సిందే. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. ప్రైవేటు పాఠశాలలు తర్వాత తేదీల్లోనైనా ఎన్నికలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఒకే ఆవరణలో వేర్వేరు యుడైస్‌ కోడ్‌లతో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్కూళ్లను నడుపుతుంటే వాటికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం అన్ని స్కూళ్ల ఎస్‌ఎంసీలను ప్రస్తుతం రద్దు చేసినట్లే. ఏదైనా పాఠశాల ఎస్‌ఎంసీకి ఇంకా గడువు ఉన్నా అది కూడా రద్దయినట్లుగా భావించి తాజాగా కొత్తది ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించి ఎస్‌ఎంసీని ఏర్పాటు చేయకపోతే వాటికి ప్రభుత్వ రాయితీలు, గ్రాంట్స్‌ను నిలిపివేస్తారు. ఎయిడెడ్‌ పాఠశా లల యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు ఇష్టపడకపోతే ఆ విషయాన్ని సంబంధిత విద్యాశాఖ అధికారులు వారి నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలి. పాఠశాల విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజనం, విద్యామిత్ర కిట్లు, గ్రాంట్లు కూడా తమకు వద్దని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రధానోపాధ్యాయులు నోటీసు బోర్డుల్లో ప్రకటించారు. గతంలో రెండుసార్లు ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కాని, వైస్‌ చైర్మన్‌గా కాని పనిచేసిన వారు ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - Sep 26 , 2026 | 03:15 AM