నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:58 AM
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో మంగళ వారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచే శారు. జిల్లాలోని 1,434 ప్రభుత్వ, 46 ఎయిడెడ్ కలిపి 1,480 పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయి.
1,480 పాఠశాలల్లో నిర్వహణ
ఒంగోలు విద్య, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో మంగళ వారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచే శారు. జిల్లాలోని 1,434 ప్రభుత్వ, 46 ఎయిడెడ్ కలిపి 1,480 పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 1.03 లక్షల మంది విద్యార్థుల తల్లిదం డ్రులు పాల్గొననున్నారు. తల్లిదండ్రులలో ఒకరికి మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. పాఠశాల మొత్తం అర్హులైన ఓటర్లలో 50శాతం మంది హాజరైతేనే కోరం అయినట్లుగా భావించి ఎన్నికలు నిర్వహించాలి. కోరం లేకపోతే నిర్వహించరాదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎస్‌ఎంసీ సభ్యులను ఎన్నుకుంటారు. వంద మందికి 12 నుంచి 15 మంది, 100 నుంచి 500 మంది వరకు 15 నుంచి 20 మంది, 500 మందిపైన విద్యార్థులు ఉంటే 20 నుంచి 25 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికలు ఏకగ్రీవం కాకపోతే పోటీచేసిన అభ్యర్థులను చేతులెత్తే విధానంలో లేక వారి వాయిస్ ద్వారా ఈ రెండింటి విషయంలో ఏకాభిప్రాయం రాకపోతే రహస్య బ్యాలెట్ ద్వారా సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
50శాతం మంది హాజరు తప్పనిసరి
పాఠశాలల్లో 12 మందిలోపు విద్యార్థులు ఉంటే వాటిల్లో ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదు. మొత్తం 12మంది ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంసీ సభ్యులు అయినట్లే. ఈ పాఠశాలల్లో కేవలం ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నికలు నిర్వహించాలి. ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సభ్యుల్లో 50శాతం మంది హాజరు తప్పనిసరి. చైర్మన్, వైస్ చైర్మన్లలో తప్పనిసరిగా ఒకరు మహిళ ఉండాలి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఎంసి సభ్యులు, మధ్యాహ్నం 1.30 నుంచి గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారు.