Share News

నేడు 591 పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:37 AM

జిల్లాలో వాయిదాపడిన 591 పాఠ శాలల్లో నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్ని కలు గురువారం జరగనున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని 578 స్కూళ్లలో ఎన్నికలను వాయిదా వేశారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో కోరం లేని కారణంగా 13 పాఠశా లల్లో ఆగిపోయాయి.

నేడు 591 పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఒంగోలు విద్య, సెప్టెంబరు 30 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో వాయిదాపడిన 591 పాఠ శాలల్లో నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్ని కలు గురువారం జరగనున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని 578 స్కూళ్లలో ఎన్నికలను వాయిదా వేశారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో కోరం లేని కారణంగా 13 పాఠశా లల్లో ఆగిపోయాయి. వీటన్నింటికీ గురువారం ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వ హించాలని సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఎంసీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఉదయం ఎన్నికలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌ఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 01:37 AM