Share News

స్మార్ట్‌ విద్యుత్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:00 AM

విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లను ప్రయోగిస్తోంది. తొలివిడత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తోంది.

స్మార్ట్‌ విద్యుత్‌
త్రిపురాంతకం స్వర్ణగ్రామ కార్యాలయంలో స్మార్ట్‌ మీటర్‌

ప్రీపెయిడ్‌ మీటర్ల ప్రయోగం

తొలి విడత ప్రభుత్వ కార్యాలయాల్లో 9,634 ఏర్పాటు

త్వరలో వినియోగంలోకి.. ఇక అక్కడ డిజిటల్‌ లెక్క

రీచార్జి చేస్తేనే కరెంటు సరఫరా

మార్కాపురం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లను ప్రయోగిస్తోంది. తొలివిడత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాలయాల్లో 10,069 మీటర్లు ఉండగా వాటి స్థానంలో ఇప్పటికే 9,634 స్మార్ట్‌ మీటర్లు బిగించారు. త్వరలోనే వాటి వినియోగాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీని వలన విద్యుత్‌ వినియోగంపై నిరంతర పర్యవేక్షణతోపాటు, మీటర్లలో రీడింగ్‌ తీసే విధానానికి చెక్‌ పడనుంది. అంతటా డిజిటల్‌ లెక్క ఉండబోతోంది. అదికూడా ఆన్‌లైన్‌లోనే రీడింగ్‌ చూసేలా ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ప్రీపెయిడ్‌ విధానంలో ఇవి వినియోగించాల్సి ఉంటుంది. రీచార్జి చేస్తేనే కరెంటు సరఫరా అవుతుంది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఆర్‌డీఎ్‌సఎస్‌ (రీవ్యాం్‌పడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం) కార్యక్రమం ఇది. కరెంటు వినియోగాన్ని డిజిటల్‌ రూపంలో నమోదు చేసి డిస్కం సర్వర్‌కు స్మార్ట్‌ మీటర్లు పంపుతాయి. వీటివల్ల ఆటోమేటిక్‌ రీడింగ్‌ నమోదవుతుంది. మొబైల్‌ యాప్‌లో కానీ, వెబ్‌ పోర్టల్‌ ద్వారా కానీ మన వినియోగాన్ని పరిశీలించుకునే వెసులుబాటు ఉంటుంది. తొలివిడత జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతరత్రా అన్నింటిలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 03:00 AM