Share News

విధులకు డుమ్మా

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:54 PM

సీఎ్‌సపురం ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్‌ విధులకు డుమ్మా కొడుతున్నారు. దాదాపు వారం నుంచి అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

విధులకు డుమ్మా
ఖాళీగా ఉన్న సీఎ్‌సపురం ఎంపీడీవో కుర్చి, జడ్పీటీసీ కౌంటింగ్‌ సమయంలో నిద్రపోతున్న ఎంపీడీవో(ఫైల్‌)

అందుబాటులో లేని సీఎస్‌పురం ఎంపీడీవో

పంచాయతీ ఎన్నికలున్నా చలించని అధికారి

ఇబ్బందులుపడుతున్న సిబ్బంది

సీఎ్‌సపురం(పామూరు) నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సీఎ్‌సపురం ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్‌ విధులకు డుమ్మా కొడుతున్నారు. దాదాపు వారం నుంచి అందుబాటులో లేకపోవడంతో ముఖ్యంగా ఎన్నికల సమయం కావడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు ఎంపీడీవోగా సెలవుపై ఉన్న ఆయనను సీఎ్‌సపురం ఎంపీడీవోగా నియమించడంతో సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ కార్యాలయంలో అందుబాటులో ఉండరని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 7న జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా విధుల్లో ఉన్న ఆయన ప్రవర్తన చర్చనీయాంశమైంది. ఉత్కంఠభరితంగా కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో తనకు సంబంధం లేదన్నట్లు నిద్రకు ఉపక్రమించడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాక ఆ రోజు నుంచి సెలవు పెట్టకుండా విధులకు డుమ్మాకొడుతున్నారు. దీంతో కార్యాలయంలో ఆయన కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పత్రాలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నాయి. ఎన్నికల విధులను అనునిత్యం పర్యవేక్షిస్తూ కార్యాలయంలో సిబ్బందిని గాడిలో పెట్టి జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన అధికారే విధులకు డుమ్మాకొడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎంపీడీవో కార్యాలయాన్ని గాడిలో పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించగా ఈ విషయమై ఎన్నికల్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ఎంపీడీవోను ఆంధ్రజ్యోతి ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Nov 12 , 2026 | 10:54 PM