‘పది’ విద్యార్థులకు ఆరు మార్కులు యాడ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:14 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టు ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఆరు మార్కులు కలపాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ (డీజీఈ) కేవీ శ్రీనివాసులరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
హిందీలో 2, ఇంగ్లీష్‌లో 4
ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఉత్తర్వులు
ఒంగోలు విద్య, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టు ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఆరు మార్కులు కలపాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ (డీజీఈ) కేవీ శ్రీనివాసులరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో వచ్చిన తప్పులతో విద్యార్థులు నష్టపోతున్నారని, యాడ్ స్కోర్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డీజీఈని కలిసి విజ్ఞప్తి చేశాయి. స్పందించిన ఆయన ఆరు మార్కుల యాడ్ స్కోర్ ప్రకటించారు. హిందీ ప్రశ్నపత్రంలో 3వ ప్రశ్నకు, 6వ ప్రశ్నకు ఒక్కొక్కటి చొప్పున రెండు మార్కులు కలపనున్నారు. ఇంగ్లీషు ప్రశ్నపత్రంలో పార్ట్-బీలో 28వ ప్రశ్నకు నాలుగు మార్కులు యాడ్ స్కోర్ ఇచ్చారు. పార్ట్-ఏలో 17వ ప్రశ్నకు బీ,ఏ,డీ,సీ,ఈ లేక ఏ,డీ,బీ,సీ,ఈ రెండింటిలో ఏదైనా కరెక్టేనని మార్కు ఇమ్మన్నారు. విద్యార్థులు ఎవరైతే ఈ ప్రశ్నలకు జవాబు రాస్తారో వారికి మాత్రమే యాడ్ స్కోరు లభిస్తుంది. ఈ ప్రశ్నలను టచ్ చేయని వారికి యాడ్ స్కోర్ వర్తించదని డీజీఈ పేర్కొన్నారు.