Share News

నేటితో ముగుస్తుంది ‘సర్‌’

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:03 AM

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) చివరి దశకు వచ్చింది. గతనెల 15న ప్రారంభమైన ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిఽధిలోని 1,649 పోలింగ్‌ కేంద్రాల్లో 13,99,006 మంది ఓటర్లు ఉన్నారు.

నేటితో ముగుస్తుంది ‘సర్‌’

జిల్లాలో 99.75 శాతం డిజిటలైజేషన్‌

1,468 కేంద్రాల్లో నూరుశాతం

21న ముసాయిదా ఓటర్ల జాబితా

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) చివరి దశకు వచ్చింది. గతనెల 15న ప్రారంభమైన ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిఽధిలోని 1,649 పోలింగ్‌ కేంద్రాల్లో 13,99,006 మంది ఓటర్లు ఉన్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 13,95,516 మంది (99.75శాతం) మంది సమర్పించిన ఎన్యుమరేషన్‌ ఫాంలను బీఎల్వోలు డిజిటలైజేషన్‌ చేశారు. మిగిలిన వాటిని కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నారు. 1,468 పోలింగ్‌ కేంద్రాల్లో నూరుశాతం డిజిటలైజేనషన్‌ పూర్తిచేశారు. ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అందులో ఓటు లేని వారు మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది.

Updated Date - Jul 14 , 2026 | 03:03 AM