Share News

గుండెపోటుతో సింగరాయకొండ ఎంపీడీవో హఠాన్మరణం

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:00 PM

సింగరాయకొండ ఎంపీడీవో డి. జయమణి(60) శనివారం ఉదయం కావలిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.

గుండెపోటుతో సింగరాయకొండ ఎంపీడీవో హఠాన్మరణం

మృతదేహానికి నివాళులర్పిస్తున్న జడ్పీ సీఈవో చీరంజీవి, అధికారులు

సింగరాయకొండ, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండ ఎంపీడీవో డి. జయమణి(60) శనివారం ఉదయం కావలిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె గతంలో నాగులుప్పలపాడు ఎంపీడీవోగా పనిచేశారు. ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా నకరికల్లు బదిలీపై వెళ్లారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 సెప్టెంబర్‌లో సింగరాయకొండ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మండల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. మృధుస్వభావిగా మండల ప్రజల మన్ననలు పొందారు. ఆమె మరణవార్త తెలుసుకొన్న జడ్పీ సీఈవో చిరంజీవి, డిప్యూటీ సీఈవో బాలమ్మ, డీఎల్‌డీవో సువార్త, తహసీల్దార్‌ ఎన్‌వీబీ రాజేష్‌, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, పలుశాఖల అధికారులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 11:00 PM