వార్డెన్‌కు షోకాజ్
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:57 PM
జరుగుమలిల్లోని సంక్షేమశాఖ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటనపై వంటి మనిషి శారదను ఆ శాఖ అధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. హాస్టల్ ఇన్‌చార్జి వార్డెన్ థెరిస్సమ్మకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాధికారత అధికారి నిర్మలజ్యోతి బుధవారం షోకాజ్ నోటీసు జారీచేశారు.
ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
ఒంగోలు నగరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి) : జరుగుమలిల్లోని సంక్షేమశాఖ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటనపై వంటి మనిషి శారదను ఆ శాఖ అధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. హాస్టల్ ఇన్‌చార్జి వార్డెన్ థెరిస్సమ్మకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాధికారత అధికారి నిర్మలజ్యోతి బుధవారం షోకాజ్ నోటీసు జారీచేశారు. హాస్టల్‌లో పదో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరుగుమల్లిలోని హాస్టల్ నుంచి బయటకొచ్చి ఆటోలో బయలుదేరి ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలులో ఉంటున్న డీఆర్‌డీఏ మాజీ ఉద్యోగి వెంకటరావు ఇద్దరిని తన ఇంటికి తీసుకుపోయాడు. హాస్టల్ వంటమనిషి ఽశారద తమకు వెంకటరావు ఫోన్ నంబర్ ఇచ్చి ఒంగోలు పంపినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. మంగళవారం వెంకటరావు తన ఇంటికి తీసుకుపోయి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని తమ బంధువులకు తెలియజేయటంతో వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీనిపై బుధవారం ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి నిర్మలజ్యోతి వంట మనిషి శారదను సస్పెండ్ చేసి వార్డెన్ థెరిసమ్మకు షోకాజ్ నోటీసు జారీచేశారు. జరుగుమల్లి పోలీసు స్టేషన్‌లో డీఆర్‌డీఏ మాజీ ఉద్యోగి వెంకటరావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. కాగా వంట మనిషి శారదకు, డీఆర్‌డీఏ మాజీ ఉద్యోగి వెంకటరావుకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ పరిచయం కొద్ది ఇద్దరు విద్యార్థినులను వెంకటరావు ఇంటికి పంపినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. వంట మనిషి శారద రెగ్యులర్ ఉద్యోగి కాగా, వార్డెన్ థెరిస్సమ్మ తాళ్లూరు హాస్టల్‌కు రెగ్యులర్ వార్డెన్‌గా పనిచేస్తూ జరుగుమల్లికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.