మార్చి ఆఖరుకు పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:13 AM
పీఎంశ్రీ పథకం కింద సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా చేపట్టిన సివిల్ పనులను మార్చి ఆఖరుకు పూర్తిచేయా లని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం కింద జిల్లాకు 2025-26 విద్యా సంవత్సరంలో రూ.7.99 కోట్లు విడుదలయ్యాయి.
పీఎంశ్రీ నిర్మాణాలపై ప్రభుత్వం ఆదేశం
ఒంగోలు విద్య, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పీఎంశ్రీ పథకం కింద సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా చేపట్టిన సివిల్ పనులను మార్చి ఆఖరుకు పూర్తిచేయా లని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం కింద జిల్లాకు 2025-26 విద్యా సంవత్సరంలో రూ.7.99 కోట్లు విడుదలయ్యాయి. వీటితో దొనకొండ, కనిగిరి, దర్శి, నాగులుప్పలపాడు మండల విద్యావనరుల కేంద్రాలు, కొత్తగా ఇంటర్మీడియెట్ ప్రారంభమైన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీ బీవీ) భవన నిర్మాణాలు చేపట్టారు. వాటన్నింటినీ మార్చి 31వతేదీలోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. నిధులను ఇతర పనులకు వినియోగించరాదని పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది పెట్టిన బిల్లులను వెంటనే పరిశీలించి చెల్లింపులు చేయాలన్నారు. జాప్యం చేస్తే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని ఏపీసీలను హెచ్చరించారు.