భారత నౌకాదళం లెఫ్టినెంట్‌గా షహజాద్
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:19 AM
గిద్దలూరు మండలం కంచుపల్లి గ్రామానికి చెందిన షేక్ పోలీస్ షహజాద్ భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. విశాఖపట్టణంలో ఎంబీఏ చదివిన షహజాద్ యూపీఎస్ ఎంపికలో భాగంగా ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూలో విజయం సాధించారు.
పాసింగ్ ఔట్ పరేడ్‌లో గిద్దలూరు మండలం కంచుపల్లి వాసి
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా పతకం
గిద్దలూరు టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు మండలం కంచుపల్లి గ్రామానికి చెందిన షేక్ పోలీస్ షహజాద్ భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. విశాఖపట్టణంలో ఎంబీఏ చదివిన షహజాద్ యూపీఎస్ ఎంపికలో భాగంగా ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూలో విజయం సాధించారు. భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా ఎంపికై 11 నెలలపాటు శిక్షణను పూర్తి చేశారు. శనివారం కేరళలోని కన్నూరు జిల్లా ఏజిమల వద్ద ఉన్న ఇండియన్ నేషనల్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. 427 మంది క్యాడెట్ల కవాతుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 18 మిత్రదేశాలకు చెందిన క్యాడెట్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా షహజాద్ పతకాన్ని అందుకున్నారు.