జిల్లాకు ఏడు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:57 AM
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రజాప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జిల్లాకు ఏడు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలను కేటాయించింది. అవి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నేడు ఒంగోలులో ప్రారంభించనున్న కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రజాప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జిల్లాకు ఏడు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలను కేటాయించింది. అవి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన ఉచిత రవాణా కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ వాహనాలు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రికి అందుబాటులో ఉంటూ 24 గంటలపాటు సేవలు అందించనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ నెంబరుకు ఫోన్ చేసిన వెంటనే సమీప వాహనం అక్కడకు చేరుకుంటుంది. వారిని వైద్యశాలకు చేరు స్తుంది. జిల్లాకు కేటాయించిన వాహనాలను కలెక్టర్ రాజాబాబు బుధవారం ఒంగోలులో ప్రారంభించనున్నారు.