Share News

ఏడు లీటర్ల పెట్రోలు.. రూ.12లక్షలు!

ABN , Publish Date - Jun 24 , 2026 | 02:50 AM

కందుకూరు మండలం మహదేవపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ఏడు లీటర్ల పెట్రోలుకు రూ.12లక్షల నిధులు డ్రా చేయడంపై పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్ణతేజ మండిపడ్డారు.

ఏడు లీటర్ల పెట్రోలు.. రూ.12లక్షలు!

మహదేవపురం పంచాయతీ కార్యదర్శి చేతివాటం

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : కందుకూరు మండలం మహదేవపురం గ్రామపంచాయతీ కార్యదర్శి ఏడు లీటర్ల పెట్రోలుకు రూ.12లక్షల నిధులు డ్రా చేయడంపై పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కృష్ణతేజ మండిపడ్డారు. మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులు, డీఎల్‌పీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీల్లో పెట్రోలు, డీజిల్‌ పేరుతో లక్షలు డ్రా చేస్తుంటే ఏమి చేస్తున్నారని డిప్యూటీ ఎంపీడీవోలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహదేవపురం అంశాన్ని ప్రస్థావించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి వెంటనే నివేదికను అందజేయాలని డీపీవో వెంకటేశ్వరరావును ఆదేశించారు.

Updated Date - Jun 24 , 2026 | 02:50 AM