అర్ధవీడు మండలంలో వైసీపీకి షాక్
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:06 AM
అర్ధవీడు మండలంలో 13 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారి మెడల్లో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి భారీగా వలసలు
కంభం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : అర్ధవీడు మండలంలో 13 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారి మెడల్లో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ పరిధిలోని బసిరెడ్డిపల్లి, తండా, మాగుటూరు గ్రామాలకు చెందిన 13కుటుంబాల వారు ఉన్నారు. సర్పంచ్ జయరాంనాయక్, కరణం కాశయ్య, బత్తిని సర్వేశ్వరరావు, ఎర్రగుంట్ల రాజప్ప, రామసుబ్బయ్య ఆధ్వర్యంలో గంగుల వెంకటేశ్వర్లు, వల్లెల సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎనుముల పెద్దఅంకాలు, పెద్దకిట్టయ్య, నల్లబోతుల లక్ష్మయ్య, దేశావత్ మంత్రునాయక్, బాలునాయక్, దేశవత్ శ్రీరాములు నాయక్, సీతాబాయ్, రాత్లావత్ వెంకటేశ్వర్లు, నల్లబోతుల చెన్నయ్య, తదితరులు తెలుగుదేశంపార్టీలో చేరారు.
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో ఇంటింటికీ ప్రజా ప్రభుత్వం - సంక్షేమ విజయాలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు, ప్రజలకు అందించిన సేవలు గురించి వివరించారు.