చెత్త సేకరణలో నిర్లక్ష్యంపై సీరియస్
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:36 AM
గ్రామ పంచాయతీల్లో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 35మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రతిరోజూ సమాచారం సేకరించడంతోపాటు దానిని జిల్లా అధికారులకు పంపుతోంది.
10 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, 35మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీల్లో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 35మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రతిరోజూ సమాచారం సేకరించడంతోపాటు దానిని జిల్లా అధికారులకు పంపుతోంది. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో చేపట్టకపోవడంతో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు పదిశాతం కంటే తక్కువ ప్రగతి ఉన్న పంచాయతీ కార్యదర్శులకు డీపీవో వెంకటేశ్వరరావు ఈ నోటీసులు జారీచేశారు. పర్యవేక్షించాల్సిన డిప్యూ టీ ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 10మందికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఈనెల 17వతేదీ నాటికి ఇంటింటి చెత్త సేకరణలో పురోగతి సాధిం చకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డీపీవో హెచ్చరించారు.