ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ ఇళ్లలో సోదాలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:31 AM
గిద్దలూరులో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌గా పనిచేస్తూ ఏసీబీకి దొరికిన నామన కృష్ణమోహన్‌రావు ఇళ్లలో ఆ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం చీరాల, పేరాల, కడవకుదురులలో అతనికి చెందిన మూడు గృహాల్లో ఏకకాలంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి.
అర కిలో బంగారం, అర కిలో వెండి ఆభరణాలు, రూ. 28.25లక్షల బ్యాంకు నిల్వల గుర్తింపు
ఖరీదైన గృహోపకరణాలు కూడా..
కృష్ణమోహన్‌రావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
ఒంగోలు క్రైం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరులో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌గా పనిచేస్తూ ఏసీబీకి దొరికిన నామన కృష్ణమోహన్‌రావు ఇళ్లలో ఆ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం చీరాల, పేరాల, కడవకుదురులలో అతనికి చెందిన మూడు గృహాల్లో ఏకకాలంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. కృష్ణమోహ న్‌రావు అమ్మనబ్రోలు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ గిద్దలూరు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌గా నియమితులయ్యారు. 2025 జూలై 10న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారు లకు చిక్కారు. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆయన ఆస్తులపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తవ్వేకొద్ది భారీగా ఆస్తులు బయటపడ్డాయి. వాటిలో చీరాల, పేరాల, కడవకుదురులో మూడు ఇళ్లు ఉన్నాయి.చీరాల, బాపట్ల, నెల్లూరు, వైపాలెం, వినుకొండ, విజయవాడ, మార్టూరులలో 13 ఇళ్ల స్థలాలు, చినగంజాం మండలం మోటుపల్లి, కడవకుదురులో 12.19 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. రూ.9లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు లభించాయి. 548.3 గ్రాముల బంగారం, 453 గ్రాముల వెండి అభరణాలు, మూడు ఖరీదైన చేతి గడియారాలు, టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నట్లు తేలింది. రూ.28.25 లక్ష ల బ్యాంక్ నిల్వలు, విలువైన గృహోపకరణలు ఉన్నట్లు బయటపడింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటంతో కృష్ణమోన్‌రావును తిరిగి అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా 1992లో విధుల్లో చేరిన కృష్ణమోన్‌రావు ఇంకొల్లు, ఒంగోలు, కందుకూరు, పర్చూరు, మార్టూరులో పనిచేశారు. 2011లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొంది ఒంగోలు, కంభం, దర్శి, అమ్మనబ్రోలులో విధులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌గా పనిచేస్తూ లంచం తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు.