Share News

నేటి నుంచి బడిగంట

ABN , Publish Date - Jun 12 , 2026 | 02:50 AM

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోని పాఠశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభమవుతు న్నాయి. 48 రోజుల వేసవి సెలవులు గురువారంతో ముగిశాయి. దీంతో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి.

నేటి నుంచి బడిగంట
ఒంగోలులోని ప్రభుత్వ పాఠశాల

తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు

ఒంగోలు విద్య, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోని పాఠశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభమవుతు న్నాయి. 48 రోజుల వేసవి సెలవులు గురువారంతో ముగిశాయి. దీంతో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి. విద్యార్థులు స్కూళ్ల బాట పట్టనున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా చేపట్టారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పటికే చేరారు. జిల్లాలోని 1,357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1,980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు అడ్మిషన్‌లు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి 1,04,445మంది.. ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునఃప్రారంభ రోజైన శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 02:52 AM