Share News

తేలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల లెక్క

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:44 AM

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాల లెక్క తేలింది. మొత్తం 518 పంచాయతీల్లో 6,38,558 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

తేలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల లెక్క

నేడో, రేపో ప్రభుత్వానికి నివేదించనున్న అధికారులు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాల లెక్క తేలింది. మొత్తం 518 పంచాయతీల్లో 6,38,558 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆమేరకు పంచాయ తీల్లో ప్రకటించారు. ఆ ప్రకారం జిల్లాలో ఎస్సీ ఓటర్లు 2,84,246 మంది ఉండగా వారిలో పురుషులు 1,40,556, మహిళలు 1,43,681, ఇతరులు 9 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్ల సంఖ్య 44,721 మందికి చేరగా పురుషులు 22,044, మహిళలు 22,675 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. బీసీ ఓటర్లు 3,09,591 మందికి గాను పురుషులు 1,53,443 మంది, మహిళలు 1,56,142 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈమేరకు బుధ, గురువారాల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 01:44 AM