ఉద్యమంలా మొక్కలను నాటాలి
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:22 AM
పర్యావ రణ పరిరక్షణ, ఎల్‌నినో ప్రభావం తగ్గించటం కోసం మెక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒ క్కరూ ఓ ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు.
ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): పర్యావ రణ పరిరక్షణ, ఎల్‌నినో ప్రభావం తగ్గించటం కోసం మెక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒ క్కరూ ఓ ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. రైతన్న ఫౌ ండేషన్ ఆధ్వర్యంలో అనంతసాగరం నుంచి వెంకటాద్రిపాలెం వరకూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. రైతన్న ఫౌం డేషన్ ఆధ్వర్యంలో ఎడ్లూరుపాడు నుంచి వెంక టాద్రిపాలెం వరకూ తారురోడ్డు నిర్మాణం ప్ర శంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రైతన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాశం కోటేశ్వరరా వు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ డైరెక్టర్ మాదా ల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు భైరపునేని రమణయ్య, భైరపనేని కోటయ్య, బోయపాటి శ్రీను, బత్తిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.