ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:26 AM
సంక్రాంతి వేడుకలతో గ్రామాలు సందడిగా మారాయి. పర్వదినం సందర్భంగా ఇతర ప్రాంతాల్లో వృతి, ఉద్యోగ బాద్యతల్లో ఉన్న వారు స్వగ్రామాలకు చేరుకున్నారు.
చీరాల, జనవరి16 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి వేడుకలతో గ్రామాలు సందడిగా మారాయి. పర్వదినం సందర్భంగా ఇతర ప్రాంతాల్లో వృతి, ఉద్యోగ బాద్యతల్లో ఉన్న వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. వారి వారి గ్రామాల్లో ఉత్సాహంగా పర్యటించి ఆ పాత మధురా లను గుర్తు చేసుకున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తీరానికి పర్యాటకులు పోటెత్తారు. సముద్రంలో ఈతలుకొట్టి పిల్లలతో సంతోషంగా గడిపారు. వాణిజ్య కేంద్రం చీరాలలో వస్రదుకాణాలు, రెస్టారెంట్‌లు సందడిగా మారాయి.
దగ్గుపాటి దంపతులను కలిసిన ఎమ్మెల్యే కొండయ్య
ఇదిలా ఉంటే బీజేపీ నాయకురాలు, రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారి హితేష్‌తో సంక్రాంతిని పురస్కరించకుని సరదాగా గడిపేందుకు తీరానికి విచ్చేశారు. ఈక్రమంలో వారిని ఎమ్మెల్యే కొండయ్య ఆయన కుమారుడు అమర్నాధ్‌తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా పుష్పగుచ్చం అందించి కుశలప్రశ్నలు వేశారు. అనంతరం కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. గతంలో కొండయ్యపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వెంకటేశ్వరరావు కారచేడులోని ఓ బహిరరంగ సమా వేశంలో మాట్లాడిన తీరుపై సరదాగా కొద్దిసేపు చర్చ నడిచింది. అలాగే కొండయ్య పరిపాలనను కూడా ఎంపీ దంపతులు అభినందించినట్లు తెలిసింది. తీరం అభివృద్ధిపై ఎమ్మెల్యే చొరవను కొనియాడారు. అనం తరం కొద్దిసేపు ఎంపీ దంపతులు తీరంలో బోటింగ్ చేశారు.
ముగ్గుల పోటీలు
పేరాల జక్కావారి వీధిలో గణేష్ యూత్ ఆధ్వర్యం లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో మహిళలు హాజరై రంగ వల్లులను తీర్చిదిద్దారు. విజయ గణపతి మండపం వద్ద జరిగిన పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా జరగ్గా, విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ప్రత్యేక పూజలు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణం లోని వీర రాఘవస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈక్రమంలో కమిటీ ప్రతినిధులు, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి నగరోత్సవం నిర్వ హించారు. అర్చకులు వాసుదేవ సంపత్‌కుమార్ శాస్ర్తోక్తంగా వేడుకలు నిర్వహించారు.
పర్చూరు : సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని బాపట్ల జిల్లా స్వర్ణాంధ్ర యాక్షన్ టీం ప్రతినిధి బిందు బేడా అన్నారు. సంక్రాంతి సంబరాలకు వేదికగా పర్చూరు మండలం నూతలపాడులో పీఏసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీష్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హిందూ సంస్కృతిని పెంపొందించేందుకు మహిళలకు నిర్వహించిన పోటీ ల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అంద జేశారు. అనంతరం జడ్పీటీసీ మాజీ సభ్యురాలు దాసరి ఉషారాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకొనే పెద్దపండుగ సంక్రాంతి అన్నారు. కార్య క్రమంలో విన్నకోట సీత, గన్నవరపు మాధవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
చినగంజాం : మండల పరిధిలోని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. మకర సంక్రాంతి, కనుమ పండగలను గురు, శుక్ర వారాల్లో గ్రామాల్లోని ప్రజలు ఆనందోత్సవాలతో జరపు కున్నారు. మహిళలు రంగురంగుల రంగవల్లు లను ఇళ్లముందు తీర్చిదిద్దారు. మున్నంవారిపాలెం గ్రామం లోని లక్ష్మణసీతారామస్వామి ఉత్సవ విగ్రహా లను విశేషంగా అలంకరించి ప్రత్యేకంగా అలంకరించిన టైరుబండిపై ఉంచి మున్నంవారిపాలెం, చినగంజాం, మూలగానివారిపాలెం గ్రామ ప్రధాన వీధులలో మంగళవాయిద్యాలు, బాణాసంచాలతో ఊరేగింపు నిర్వహించారు. తదనంతరం బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని చెరువులో తెప్పోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. కడవకుదురు గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మహిళలకు మండల స్థాయిముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలైన మహిళలకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్‌కుమార్, నాయకులు బహుమతులను అంద జేశారు. కడవకుదురులో టీడీపీ, శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో చెడుగుడు, రంగవల్లుల పోటీలు నిర్వ హించి, బహుమతులు అందజేశారు. గొనసపూడి గ్రామంలో చెన్నకేశవస్వామి, కాశీవిశ్వేరస్వామి, కడవకు దురులో గోకర్ణేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, చిన గంజాంలో భావనానాయణస్వామి, చిదంబరేశ్వర స్వామికి. సంతరావూరులోని లక్ష్మీచెన్నకేశవస్వామికి గ్రామోత్సవం నిర్వహించారు.
ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం
ఇంకొల్లు : ఇంకొల్లులో కనుమ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం నాగుల చెరువులో స్వామి వార్ల విగ్రహాలను ఊరేగింపుతో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. వీరభద్రుడు, చెన్నకేశ్వరుడు, భీమేశ్వరస్వామి వార్ల విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం మేళతాళాల నడుమ తెప్పోత్సవం నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు హాజరై స్వామి తీర్ధప్రసాదాలతో పాటు హారతులు అందుకున్నారు. ఇంకొల్లులో నిర్వహించిన చెక్కభజన ప్రజలను అలరింపజేసింది. గంగవరంలో డ్యాన్‌బేబి డ్యాన్ కార్యక్రమం నిర్వహించారు. ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కనుమ పండుగ సందర్భంగా గ్రామాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలోచింపజేశాయి.