Share News

రామతీర్థంకు చేరిన సాగర్‌ జలాలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 02:45 AM

తాగునీటి అవసరాలు తీర్చేందుకు విడుదల చేసిన సాగర్‌ జలాలు బుధవారం రామతీర్థం జలాశయానికి చేరుకున్నాయి. ఒంగోలు బ్రాంచి కాలువ (ఓబీసీ) ద్వారా జలాశయంలోకి 1,032 క్యూసెక్కుల నీరు ప్రవేఽశిస్తున్నాయి.

రామతీర్థంకు చేరిన సాగర్‌ జలాలు

రిజర్వాయర్‌లోకి 1,032 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

చీమకుర్తి, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి అవసరాలు తీర్చేందుకు విడుదల చేసిన సాగర్‌ జలాలు బుధవారం రామతీర్థం జలాశయానికి చేరుకున్నాయి. ఒంగోలు బ్రాంచి కాలువ (ఓబీసీ) ద్వారా జలాశయంలోకి 1,032 క్యూసెక్కుల నీరు ప్రవేఽశిస్తున్నాయి. ప్రస్తుతం రామతీర్థంలో జలాలు అడుగంటాయి. రిజర్వాయర్‌ కనిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండగా గరిష్ఠ నీటిమట్టం 85 మీటర్లు చేరుకోవడానికి ఇదే ఇన్‌ఫ్లో దాదాపు పది రోజులకు పైగా కొనసాగాల్సి ఉంది. జలాశయాన్ని పూర్తిగా నింపితేనే దాని పరిధిలో ఉన్న 30 నోటిఫైడ్‌, 12 నాన్‌ నోటిఫైడ్‌ చెరువులతోపాటు ఒంగోలు, చీమకుర్తి ఎస్‌ఎస్‌ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - Sep 03 , 2026 | 02:45 AM