Share News

ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 02:55 AM

ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ముందుకె ళ్తుందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాఽథూర్‌ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో తొలిసారి పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఒంగోలు వచ్చారు.

ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు
ఒంగోలు రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న దక్షిణ కోస్తా జీఎం సందీప్‌

ఒంగోలు రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన దక్షిణ కోస్తా జీఎం సందీప్‌

ఒంగోలు కార్పొరేషన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ముందుకె ళ్తుందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాఽథూర్‌ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో తొలిసారి పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఒంగోలు వచ్చారు. స్టేషన్‌లోని వసతులు, జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతోపాటు ప్రయాణికుల వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణం వైపు బ్రిడ్జి పనులు నిలిచిపోవడంతో అధికారులను అడిగి అందుకు గల కారణాలు తెలుసుకున్నారు. అలాగే స్టేషన్‌ ఆధునికీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమృత్‌ భారత్‌ నిధులు వెచ్చించి రూ.25కోట్లతోఒంగోలు రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు.ఆ పనులను పరిశీలించామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. దీంతోపాటు సకాలంలో రైళ్ల రాకపోకలపై కూడా దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Jun 13 , 2026 | 02:55 AM