Share News

సమగ్ర శిక్ష సిబ్బందికి రూ.8.65 కోట్లు విడుదల

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:47 AM

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు.

సమగ్ర శిక్ష సిబ్బందికి రూ.8.65 కోట్లు విడుదల

జీతాల చెల్లింపునకు బిల్లులు సిద్ధం

ఒంగోలు విద్య, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు జూన్‌, జూలై నెలల జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానిపై సోమవారం ‘జీతాల్లేవ్‌’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురిత మైంది. స్పందించిన డైరెక్టర్‌ జీతాల చెల్లింపునకు గ్రాంటు విడుదల చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాలకు రూ.137.98కోట్లు విడుదల కాగా ప్రకాశం జిల్లాకు రూ.8.65 కోట్లు ఇచ్చారు. సిబ్బంది జీతాలు, గౌరవ వేతనం, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కాస్ట్‌, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాల యాల విద్యార్థులకు డైట్‌ చార్జీలకు ఈ మొత్తాలను విడుదల చేశారు. జూన్‌ నెలకు రూ.3.97 కోట్లు, జూలై నెలకు రూ.4.68 కోట్లు విడుల య్యాయి. జీతాలు చెల్లించేందుకు స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Aug 08 , 2026 | 02:48 AM