Share News

కరువు మండలాలకు రూ.6.16 కోట్లు

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:52 AM

జిల్లాలోని కరువు మండలాల్లో 2025-26 రబీ పంట నష్టపరిహారం కోసం రూ.6.16 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన ఐదు మండలాలను కరువు ప్రాంతాలుగా గతంలో ప్రకటించింది.

కరువు మండలాలకు రూ.6.16 కోట్లు

మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మార్కాపురం, జూన్‌ 29 (ఆంరఽధజ్యోతి): జిల్లాలోని కరువు మండలాల్లో 2025-26 రబీ పంట నష్టపరిహారం కోసం రూ.6.16 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన ఐదు మండలాలను కరువు ప్రాంతాలుగా గతంలో ప్రకటించింది. అందులో కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం, హెచ్‌ఎం పాడు, కనిగిరి, పీసీ పల్లి, మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల ఉన్నాయి. ఇప్పుడు నష్టపరిహారం మంజూరు చేసింది. 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు ఈ నిధులకు పరిపాలనా అనుమతులిచ్చింది.

Updated Date - Jun 30 , 2026 | 02:52 AM