Share News

యువ భవన్‌కు రూ.4.40 కోట్లు

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:57 AM

ఒంగోలులో అసంపూర్తిగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ (యువ భవన్‌) భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.40 కోట్లు మంజూరు చేసింది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి ప్రతిపాదనలతో ఈ నిధులు మంజూరయ్యాయి.

యువ భవన్‌కు రూ.4.40 కోట్లు

మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి చొరవతో మంజూరు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో అసంపూర్తిగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ (యువ భవన్‌) భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.40 కోట్లు మంజూరు చేసింది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి ప్రతిపాదనలతో ఈ నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. ఈ భవనం పూర్తయితే ఒంగోలులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు చేకూరనుంది. నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో ఉపయోగకరంగా ఉండనుంది.

Updated Date - Aug 26 , 2026 | 02:57 AM