పాఠశాలలకు రూ.2.71 కోట్లు విడుదల
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:03 AM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస తుల కల్పనకు సమగ్ర శిక్ష ద్వారా విడుదలైన రూ.2.71 కోట్లను పాఠశాలలకు కేటాయిస్తూ డీఈవో రేణుక ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఎన్ఏ స్పార్ష్ విధానంలో పాఠశాలలకు సంబంధించిన డీడీవోలకు ఈ నిధులను విడుదల చేశారు.
అనుమతించిన అంశాలకే వినియోగించాలి
ఒంగోలు విద్య, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస తుల కల్పనకు సమగ్ర శిక్ష ద్వారా విడుదలైన రూ.2.71 కోట్లను పాఠశాలలకు కేటాయిస్తూ డీఈవో రేణుక ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఎన్ఏ స్పార్ష్ విధానంలో పాఠశాలలకు సంబంధించిన డీడీవోలకు ఈ నిధులను విడుదల చేశారు. జిల్లాలో 2,251 పాఠశాలలకు గ్రాంటు మంజూరు కాగా 1,868కు సంబంధించిన మొత్తాన్ని సంబంధిత డీడీవోలకు విడుదల చేశారు. డీడీవో కోడ్లు లేని 383 పాఠశాలల గ్రాంట్లను సంబంధిత మండల విద్యాధికారుల ఖాతాలకు జమ చేశారు. ఏపీ మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, ఇతర మరికొన్ని స్కూళ్లకు డీడీవో కోడ్ లేకపోవడంతో వాటి నిధులు ఎంఈవోలకు జమ య్యాయి. ఈ స్కూళ్ల ఎస్ఎంసీలు, హెచ్ఎంలు సంబంధిత ఎంఈవోల ద్వారా మాత్రమే ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. సమగ్రశిక్ష నిర్దేశించిన విధంగా అనుమతించిన అంశాలకే విని యోగించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో పదిశాతం నిధులను స్వచ్ఛత యాక్షన్ ప్లాన్, పారిశుధ్య కార్యక్ర మాలు, పాఠశాల వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకు వెచ్చించాలి. తరగతి గదుల మరమ్మ తులు, నిర్వహణకు 40శాతం నిధులు వినియోగిం చాలి. పాఠశాలకు నిత్యం ఉపయోగించే వస్తువులు, సామగ్రి కొనుగోలుకు 25శాతం, పిల్లలకు ఆట వస్తు వుల కొనుగోలుకు 15శాతం, ప్రయోగశాల, గ్రంథాల యాల నిర్వహణ, బోధన సామగ్రి కొనుగోలుకు పది శాతం ఉపయోగించాలి. నిధుల వినియోగానికి ఎస్ఎంసీ తీర్మానం తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధం గా వ్యవహరిస్తే బాధ్యుల నుంచి నుంచి రికవరీ చేయ డంతోపాటు వారిపై చర్యలు తీసుకుంటారు.