Share News

వైపాలెంలో 39,274 రైతులకు రూ.22.45 కోట్లు జమ

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:29 AM

పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు.

వైపాలెంలో 39,274 రైతులకు రూ.22.45 కోట్లు జమ
చెక్కులను అందిస్తున్న ఎరిక్షన్‌ బాబు, అధికారులు

ఎర్రగొండపాలెం రూరల్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు చెప్పారు. వీరభద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం వ్యాప్తంగా 39,274 మంది రైతుల ఖాతాల్లో రూ.22.45 కోట్లు జమైనట్లు తెలిపారు. చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంసీ శ్యామల కాశిరెడ్డి, ఏడీఏ వెంకటరమణ, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చూకూరి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల వెంగలరెడ్డి, ఎంపీటీసీ పసుపులేటి వెంకటనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకల శ్రీను, సౌసైటీ అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య, వేగినాటి శ్రీను, మహే్‌షనాయుడు, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, ఐదు మండలాల ఏవోలు కే నీరజ, సంగమేశ్వర రెడ్డి, జవహరలాల్‌ నాయక్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:29 AM