సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ముందడుగు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:15 AM
సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా రోటరీ ఇంటర్నేషనల్ కృషి చేస్తోందని రోటరీ డిస్ట్రిక్ గవర్నర్ ఎస్‌వీ.రాంప్రసాద్ అన్నారు.
పర్చూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా రోటరీ ఇంటర్నేషనల్ కృషి చేస్తోందని రోటరీ డిస్ట్రిక్ గవర్నర్ ఎస్‌వీ.రాంప్రసాద్ అన్నారు. జిల్లా గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా గురువారం పర్చూరులో రోటరీ క్షబ్ అధ్వర్యం లో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం స్ధానిక రోటరీ భవనంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలన్న సంకల్పంతో రోటరీ పెద్దఎత్తున ఆర్వో ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్చూరు రోటరీ గంగ పేరుతో ఫ్లాంట్‌లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా పోలియోను నిర్మూలించేందుకు రోటరీ ఇంటర్‌నేషనల్ సంస్థ ఎంతగానో కృషి చేసిందన్నారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లో మినహా మరెక్కడ ఒక్క పోలియో కేసును కూడా నమోదు కాకుండా చేసేందుకు కృషి చేసిందన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోటరీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9-14 సంత్సరాల బాలికలకు క్యాన్సర్ వ్యాధి రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒక్కొక్కరికి రూ.2600 వెచ్చించి రోటరీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా తొలివిడతగా 10 వేల మందికి వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టేం దుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు పోత్సాక నగదును గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ప్రాంగణాల్లో విద్యార్థులతో కలసి మొక్కలు నాటే కార్య క్రమం చేపట్టారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు తోకల కృష్ణమోహన్, కార్యదర్శి పంబి కోమటి ఆంజనేయులు, కోశాధికారి పంబి సదానందరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ నాగబైరు శ్రీనివాసరావు, ఎలక్ట్ గవర్నర్ కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, కొల్లా నరేంఽధ్రకుమార్, పాబోలు ఉయదభాస్కర్, కోటా హరిప్రసాద్, వెంకన్న, కోటా శ్రీనివాసరావు, కోడూరి శేష బ్రహ్మచారి, గిరి, మున్నంగి వెంకట సుబ్బయ్య, కాసా అశోక్ కుమార్ పాల్గొన్నారు.