దోపిడీ ముఠా గుర్తింపు
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:29 AM
తమిళనాడుకు చెందిన వ్యాపారులను చితకబాది రెండు కిలోల బంగారు ఆభరణాలను అపహ రించుకెళ్లిన ముఠాను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈనెల 4న ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో ఆటోలో వెళుతున్న బంగారు వ్యాపారు లైన తండ్రీకొడుకులను దోపిడీ ముఠా కారు అడ్డుపెట్టి కిడ్నాప్ చేసి తీసు కెళ్లిన విషయం విదితమే.
రెండు కిలోల బంగారం అపహరణ కేసులో కీలక మలుపు
చెన్నై వెళ్లిన పోలీసుల ప్రత్యేక బృందం
ఒంగోలు క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తమిళనాడుకు చెందిన వ్యాపారులను చితకబాది రెండు కిలోల బంగారు ఆభరణాలను అపహ రించుకెళ్లిన ముఠాను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈనెల 4న ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలో ఆటోలో వెళుతున్న బంగారు వ్యాపారు లైన తండ్రీకొడుకులను దోపిడీ ముఠా కారు అడ్డుపెట్టి కిడ్నాప్ చేసి తీసు కెళ్లిన విషయం విదితమే. వారిని ఒంగోలు నగరం దక్షిణం వైపు శివారు ప్రాంతంలో చితకబాది వారి వద్ద ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణా లను అపహరించుకెళ్లారు. ఈ మేరకు ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ పోలీసులకు ఎస్పీ అప్ప గించారు. దీంతో కేసులో కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. పక్కా ప్రణాళికతో దోపిడీ ముఠా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఠా సభ్యులు బాధితుల గురించి బాగా తెలిసిన వారే అయి ఉంటారని ప్రాథ మికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. దోపిడీ సమయంలో బంగారు వ్యాపారులతోపాటు ఓ వ్యక్తి రైలులో నుంచి వారి వెంట దిగినట్లు గుర్తించారు. అతని సమాచారం మేరకే దోపిడీ దొంగలు బంగారం వ్యాపారులను అడ్డుకొని కిడ్నాప్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారి వెంట రైలులో దిగిన వ్యక్తి సమాచారం పోలీసులు పసిగట్టగలిగారు. దీంతో దోపిడీ ముఠాలో ఎంతమంది ఉన్నారు. ఎవరు ఉన్నారు అనేది గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం చెన్నై వెళ్లినట్లు తెలిసింది. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అదే పనిలో సీసీఎస్ పోలీసులు ఉన్నట్లు తెలిసింది.