రూ.1.50కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:10 PM
మండలంలోని బోడపాడు గ్రామం వద్ద పెద్దయాచవరం, బోడపాడు గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులు, నాయకులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్, జనవరి19 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బోడపాడు గ్రామం వద్ద పెద్దయాచవరం, బోడపాడు గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులు, నాయకులతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. బోడపాడు గ్రామ శివారులోని కొత్త ఎస్సీ కాలనీ నుంచి పెద్ద యాచవరం గ్రామానికి సుమారు 2.4 కిలోమీటర్లు దూరం రూ.1.50కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో తారు రోడ్డు నిర్మాణం చేయనున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ఏపీడీ నిర్మలాదేవి, ఎంపీడీవో ఏ బాలచెన్నయ్య, పీఆర్ ఏఈ మోహన్‌రాజ్, ఈసీ కిషోర్ కుమార్, క్లస్టర్ ఇన్‌చార్జి వెంకట నారాయణ, టీఏ శ్రీలక్ష్మి, మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బొగ్గు శేఖర్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, శ్రీను, వీఆర్వో మల్లికార్జునరెడ్డి, సెక్రటరీ విజయలక్ష్మి పాల్గొన్నారు.