చీమకుర్తి బైపా్‌సపై రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:20 AM
చీమకుర్తి బైపా్‌సపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చీమకుర్తి పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుచున్న విద్యార్థి బొడ్డు తరుణ్(15) దుర్మరణం పాలయ్యాడు.
పదో తరగతి విద్యార్థి దుర్మరణం
చీమకుర్తి, మార్చి27(ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి బైపా్‌సపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చీమకుర్తి పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుచున్న విద్యార్థి బొడ్డు తరుణ్(15) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... చీమకుర్తి పట్టణానికి చెందిన తరుణ్ పండగ సెలవు కావటంతో తన సహచర మిత్రులు మరో ఇద్దరితో కలిసి బైక్‌పై చీమకుర్తి పశ్చిమ బైపా్‌సపై ప్రయాణిస్తుండగా లారీని క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో బైక్ పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తరుణ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన మిగిలిన ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.