కందుకూరు వద్ద రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:59 PM
ఒంగోలు నుంచి పామూరుకు కారులో ప్రయాణిస్తూ ఎదురుగా ఆగి ఉన్న ఆల్వీన్ వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పామూరుకు చెందిన యువకుడు శేషిరెడ్డికి తీవ్ర గాయాలుకాగా, మరోయువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒకరు మృతి - మరొకరికి తీవ్రగాయాలు
పామూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నుంచి పామూరుకు కారులో ప్రయాణిస్తూ ఎదురుగా ఆగి ఉన్న ఆల్వీన్ వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పామూరుకు చెందిన యువకుడు శేషిరెడ్డికి తీవ్ర గాయాలుకాగా, మరోయువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు సమీపంలోని కొండముడుసుపాలెం జంక్షన్‌వద్ద చోటుచేసుకుంది. పామూరు సింగిల్‌విండో కార్యాలయ సీఈవో ఎన్ ఆది శేషిరెడ్డి, కనిగిరి సొసైటిలో పనిచేస్తున్న చంద్‌బాషలు కారులో ఒంగోలు కార్యాలయానికి మంగళవారం వెళ్లి రాత్రి కందుకూరు మీదుగా పామూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో కందుకూరు జాతీయ రహదారి జంక్షన్‌వద్ద జామాయిల్ కర్ర తాట తీసే ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చాంద్‌బాష అక్కడికక్కడే మృతి చెందగా పామూరు పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన శేషిరెడ్డికి తల నుదుటికి తీవ్ర రక్త్తగాయాలు అయ్యాయి. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.