Share News

కోల్డ్‌వార్‌పై విచారణకు ఆర్‌జేడీ ఆదేశం

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:23 AM

సంతమాగులూరు మండలంలో ఉపాధ్యాయులు, ఎంఈవో మధ్య విభేదాలపై ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈవో రేణుక విచారణకు ఆదేశించారు. ‘ఉపాధ్యాయులు, ఎంఈవో మధ్య కోల్డ్‌వార్‌’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. విచారించి నివేదిక అందజేయాలని చీరాల డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ గంగాధరరావును ఆదేశించారు.

కోల్డ్‌వార్‌పై విచారణకు ఆర్‌జేడీ ఆదేశం

ఉన్నతాధికారులకు త్వరలో నివేదిక అందజేస్తా

డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ గంగాధరరావు

సంతమాగులూరు (అద్దంకి), మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సంతమాగులూరు మండలంలో ఉపాధ్యాయులు, ఎంఈవో మధ్య విభేదాలపై ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈవో రేణుక విచారణకు ఆదేశించారు. ‘ఉపాధ్యాయులు, ఎంఈవో మధ్య కోల్డ్‌వార్‌’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. విచారించి నివేదిక అందజేయాలని చీరాల డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ గంగాధరరావును ఆదేశించారు. విచారించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని గంగాధరరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఎంఈవో ఎలాంటి తప్పులు చేయలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరికొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం ఇప్పటికే ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంత్రి రవికుమార్‌ను కలిసి మండల విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 02:24 AM