పల్లె పండుగ 3.0 ఏర్పాటు పరిశీలన
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:01 PM
మార్కాపురం జిల్లా చివరి ప్రాం తమైన పామూరుకు నెల్లూరు జిల్లా చివరి ప్రాంతమైన వరికుంటపాడు మండలాలకు మధ్యనున్న రామాపురంలో ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో సభ స్థలి వద్ద జరుగుతున్న కార్యక్రమాలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురే్‌షతో కలిసి టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరశింహారెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పామూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా చివరి ప్రాం తమైన పామూరుకు నెల్లూరు జిల్లా చివరి ప్రాంతమైన వరికుంటపాడు మండలాలకు మధ్యనున్న రామాపురంలో ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో సభ స్థలి వద్ద జరుగుతున్న కార్యక్రమాలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురే్‌షతో కలిసి టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరశింహారెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి వేదిక, సభా ప్రాంగణం, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రాత ఏర్పాట్లు, మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం, తదితర మౌలిక సదుపాయాల అంశాలపై జరుగుతున్న ఏర్పాట్లను పరివీలించి నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖల అధికారులు సమస్వయంతో పనిచేయాలని ప్రతి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఉగ్ర వెంబడి పామూరుకు చెందిన టీడీపీ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరశింహారావు, యారవ శ్రీనివాస్, జయరామిరెడ్డి, ఉప్పలపాటి హరిబాబు, అమీర్‌బాబు, ఇర్రి కోటిరెడ్డి, ఎన్ సాంబయ్య ఉన్నారు.