సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:32 PM
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం యద్దనపూడి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పారదర్శకంగా పూర్తిచేసేందుకు ఈ రెవెన్యూ క్లినిక్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
పర్చూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం యద్దనపూడి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పారదర్శకంగా పూర్తిచేసేందుకు ఈ రెవెన్యూ క్లినిక్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం గ్రామంలో నాయకులతో కలసి పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ, యోగక్షేమాలు అడుగుతూ ముందుకు సాగారు. ఈకార్యక్రమంలో పర్చూరు ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు, తహసీల్దార్ రవి కుమార్, డిప్యూటీ తహసీల్దార్ విష్ణు, సర్పంచ్ రేణుకా బాలకోటయ్య, జడ్పీటీసీ లక్ష్మీనారాయణమ్మ, నాయకులు నల్లపనేని రంగయ్య చౌదరి, రావిపాటి సీతయ్య, కనపర్తి నాగేశ్వరరావు, తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
మాస్టర్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన శివ నారాయణ, షేక్ రహమాన్, నాగరాజులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు.