ఉద్యోగులకు సెలవులపై ఆంక్షలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:37 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సెలవుల మంజూరుపై ఆంక్షలు విధిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర పరిపాలనా కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులు
ఒంగోలు విద్య, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సెలవుల మంజూరుపై ఆంక్షలు విధిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర పరిపాలనా కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సాధారణ, ఆర్జిత, ఐచ్చిక, ఇతర ఏరకమైన సెలవులు అయినా తనతోపాటు జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ముందస్తు అనుమతితో మాత్రమే మంజూరు చేయాలన్నారు. అనుమతి లేకుండా ఎవరూ తమ కార్యస్థానాలను విడిచి వెళ్లకూడదన్నారు. అత్యవసర విధుల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా మొబైల్ ఫోన్లను ఆన్‌లో ఉంచుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.