త్రివర్ణ శోభితం
ABN , Publish Date - Aug 15 , 2026 | 02:53 AM
స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా ముస్తాబైంది. జిల్లాస్థాయి ఉత్సవాలకు ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి శనివారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా ముస్తాబు
ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి స్వామి
కలెక్టరేట్‌తోపాటు పలు ప్రాంతాల్లో మువ్వన్నెల విద్యుత్ కాంతులు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా ముస్తాబైంది. జిల్లాస్థాయి ఉత్సవాలకు ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి శనివారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలిస్తారు. వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్టాల్స్, శకటాలను ప్రదర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇస్తున్న ప్రాధాన్యతలను వివరిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరోవైపు వేడుకల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నారు. మరోవైపు వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజాప్రతి నిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖు లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లా పరిపాలన భవన్ (కలెక్టరేట్)తో పాటు పలుప్రాంతాల్లో మువ్వన్నెల రంగులతో విద్యుదీకరణ చేశారు.