Share News

పోలింగ్‌ సిబ్బందికి పారితోషికం పెంపు

ABN , Publish Date - Nov 18 , 2026 | 10:57 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పారితోషికాన్ని ప్రభుత్వం పెంచింది. కొందరికి చెల్లించే రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేయగా మరికొందరికి ఒకటిన్నర రెట్లు పెంచింది.

పోలింగ్‌ సిబ్బందికి పారితోషికం పెంపు

కొందరికి రెట్టింపు, మరికొందరికి ఒకటిన్నర రెట్లు అదనం

ప్యాక్డ్‌ లంచ్‌, లైట్‌ రిఫ్రె్‌షమెంట్స్‌కు కూడా...

ఒంగోలు విద్య నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పారితోషికాన్ని ప్రభుత్వం పెంచింది. కొందరికి చెల్లించే రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేయగా మరికొందరికి ఒకటిన్నర రెట్లు పెంచింది. ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఎక్కువ రోజులు విధులు నిర్వహించే అధికారులకు మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌ నిర్వహించే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ /కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు రోజుకు రూ.350నుంచి రూ.500 లేదా ఏకమొత్తం(ఎన్నికల విధులు నిర్వహించిన కాలానికి)గా రూ.2వేలకు పెంచారు. పోలింగ్‌ ఆఫీసర్‌కు రోజుకు రూ.250నుంచి రూ.400 లేదా ఏకమొత్తంగా రూ.1600లకు పెంచారు. కౌంటింగ్‌ అసిస్టెంట్‌కు రోజుకు రూ.250నుంచి రూ.450 లేదా ఏకమొత్తంగా రూ.1350కు పెంచారు. ఆఫీసు సబార్డినేట్‌(క్లాస్‌-4) రోజుకు రూ.200నుంచి రూ.350 లేదా ఏకమొత్తంగా రూ.1400లకు పెంచారు. పోలింగ్‌ సిబ్బందికి ప్యాక్డ్‌ లంచ్‌, లైట్‌ రిఫ్రె్‌షమెంట్స్‌కు ఇచ్చే రూ.150ని రూ.500లకు పెంచారు. మైక్రో అబ్జర్వర్లకు ఏకమొత్తంగా చెల్లించే వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచగా, స్టాటిక్‌ సర్వేలైన్స్‌ టీమ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, క్లాస్‌1, 2లకు రూ.1200 నుంచి రూ.3వేలకు, క్లాస్‌-3 వారికి వెయ్యి నుంచి రూ. 2వేలకు పెంచారు.

అధికారులకు మొండిచేయి

ఎన్నికల్లో విధులు నిర్వహించే గజిటెడ్‌ స్థాయి అధికారులకు మాత్రం పారితోషికం పెంపులో ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. జోనల్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లు, సెక్టార్‌ ఆఫీసర్లు, ఆర్వో స్టేజ్‌-1, ఏఆర్వో స్టేజ్‌-1, ఆర్వో స్టేజ్‌-2 అధికారులకు రెమ్యూనరేషన్‌ పెంచలేదు. వీరికి గతంలోనే వెయ్యి పారితోషికం ఉండేది. ప్రస్తుతం కూడా అంతే మొత్తం చెల్లిస్తారు. మిగిలిన అధికారులకు కూడా గతంలో ఎంత చెల్లించారో ఇప్పుడు కూడా అంతే చెల్లించనున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 10:57 PM