Share News

ఆటవిడుపు

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:03 PM

నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే ఎక్సైజ్‌ సిబ్బంది, అధికారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొన్నారు.

ఆటవిడుపు
బెలూన్లు ఎగురవేసి పోటీలను ప్రారంభిస్తున్న డీసీ హేమంత్‌నాగరాజు, ఏసీ విజయ,

ఎక్సైజ్‌ శాఖ ఆటల పోటీలు ప్రారంభం

క్రీడాపోటీలు ప్రారంభించిన ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌

ఒంగోలు క్రైం, మార్చి 12(ఆంధ్రజ్యోతి) : నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే ఎక్సైజ్‌ సిబ్బంది, అధికారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొన్నారు. గురువారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోటీలలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే పోటీలను ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు ప్రారంభించారు. తొలిరోజూ పరుగు పందెం, లాంగ్‌ జంప్‌, సాఫ్ట్‌పుట్‌తోపాటు వాలీబాల్‌ కబడీ, క్రికెట్‌ పోటీలు జరిగాయి. జిల్లా అధికారులు పోటీలలో పాల్గొన్నారు. మహిళ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటమిలు సహజమన్నారు. ఇలాంటి ఆహ్లాదకరమైన పోటీలలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో విజేతలు అయిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ కే విజయ, జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఆషాబేగం పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 11:03 PM